HYD: పట్టుబడ్డ డ్రగ్స్ ముఠా.. వెలుగులోకి సంచలన విషయాలు

గిఫ్ట్ ప్యాకింగ్, ప్రముఖ బ్రాండెడ్ వస్త్రాలు, గాజుల బాక్సుల్లో నిషేధిత డ్రగ్స్ రవాణాకు కొత్త మార్గం.

Update: 2022-12-13 05:47 GMT

దిశ, వెబ్ డెస్క్: అందంగా గిఫ్ట్ ప్యాకింగ్, ప్రముఖ బ్రాండెడ్ వస్త్రాలు, గాజుల బాక్సుల్లో నిషేధిత డ్రగ్స్ రవాణా ఇది డ్రగ్స్ ముఠా ఎంచుకున్న కొత్త మార్గం. మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఠా హైదరాబాద్, పూణె విమానాశ్రయాల నుంచి నిషేధిత సూడోఎడిఫ్రిన్ ను ఆస్ట్రేలియా, న్యూజిలాంగ్ దేశాలకు రవాణా చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై నిఘా ఉంచిన పోలీసులు ఆస్ట్రేలియాకు పంపేందుకు హైదరాబాద్ తెచ్చిన రూ.9కోట్ల విలువైన 8.5 కిలోల సూడోఎఫిడ్రిన్ ను నాచారం వద్ద పట్టుకున్నారు.

ఈ కేసులో చెన్నైకి చెందిన మహ్మద్ కాశీం(31), రసూలుద్దీన్(39)లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.4లక్షల నగదు, 5 పాస్ పోర్టులు, కొరియర్ సంస్థల రశీదులు, నకిలీ పాన్, ఆధార్ కార్డులు, ల్యాప్ టాప్ 10 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన కీలక సూత్రధారి రహీమ్, పూణెకి చెందిన ఫరీద్, ఫైసల్ లు పరారీలో ఉన్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్, డీసీపీలు రక్షిత, మురళీధర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మహ్మద్ కాశీం, రసూలుద్దీన్ చిన్ననాటి స్నేహితులు. తరచూ దుబాయ్, మలేషియాకు వెళ్లి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కెమెరాలు, సిగరెట్లు కొని చెన్నైకి తెచ్చి అమ్మేవారు.

వీరికి డ్రగ్స్ రవాణా ప్రధాన సూత్రధారి రహీమ్ పరిచయం అయ్యాడు. అధిక మొత్తం డబ్బు ఆశ చూపి సూడోఎఫిడ్రిన్ రవాణాకు వినియోగించుకున్నాడు. హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఎనిమిది సార్లు, పూణె నుంచి ఏడు సార్లు రూ.100కోట్లకు పెగా విలువైన 70 కిలోల సూడో ఎఫిడ్రిన్ ను తరలించడం షాక్‌కు గురిచేసింది. సూడోఎఫిడ్రిన్ విలువ కిలోకు రూ.కోటి ఉంటుంది. దీని నుంచి మెథాఎంఫెటమిన్ అనే డ్రగ్ తయారు చేస్తారు. దీని విలువ కిలోకు రూ.5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Read More....

గర్ల్స్ ఆశ్రమ పాఠశాలలో కలకలం.. ఆస్పత్రి పాలైన 45 మంది విద్యార్థినీలు 

Tags:    

Similar News