భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య..
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లో భార్య కాపురానికి రావడం లేదని
దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లో భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిని మండలానికి చెందిన జంగంపల్లి రాకేష్ ఈనెల 13న నెన్నెల మండలం అత్తగారింటికి వెళ్లాడు. తాగుడుకు బానిసైన రాకేష్ తో గొడవ పెట్టుకుని భార్య గౌరు పది రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళింది. భార్యను తీసుకువెళ్లేందుకు రాకేష్ అత్తగారింటికి వెళ్ళాడు. తాగుడు మానితేనే ఇంటికి వస్తానని భార్య కరాఖండిగా చెప్పడంతో మనస్థాపానికి గురైన రాకేష్ కన్నెపల్లి మండలంలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.