ప్రాణం తీసిన భార్యాభర్తల గొడవ
భార్యాభర్తల మధ్య గొడవ ఓ నిండుప్రాణం తీసింది. గొడవతో మనస్థాపం చెందిన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోయగూడెం గ్రామంలో చోటు చేసుకుంది.
దిశ,టేకులపల్లి : భార్యాభర్తల మధ్య గొడవ ఓ నిండుప్రాణం తీసింది. గొడవతో మనస్థాపం చెందిన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోయగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. టేకులపల్లి ఎస్సై పోగుల సురేష్ తెలిపిన వివరాల ప్రకారం కోయగూడెం గ్రామానికి చెందిన పూన్నెం ఆశోక్ కుమార్ (38) శనివారం సాయంత్రం భార్య సుమలతతో గొడవ పెట్టుకొని రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
ఆదివారం ఉదయం కోయగూడెం నుంచి కేఓసీకి వెళ్లే దారిలో చీమల కాంతయ్య పత్తి చేనులో వేపచేట్టుకు ఉరివేసుకొని చనిపోయి కనిపించాడు. స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.