Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం

ప్రకాశం(Prakasham) జిల్లా కుంభం మండలం ఎర్రబాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది.

Update: 2025-01-05 03:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం(Prakasham) జిల్లా కుంభం మండలం ఎర్రబాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని.. వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందిన పోలీసులు నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News