షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం, ఆస్తి నష్టం..
మండలంలోని కేస్లి తాండ గ్రామపంచాయితీ పరిధిలోని తుమ్మలకుంట తాండ వర్త్యవత్ దేవి ఇల్లు గురువారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పాటు, సామన్లు మొత్తం పూర్తిగా దగ్ధమైంది.
దిశ, వెల్దండ : మండలంలోని కేస్లి తాండ గ్రామపంచాయితీ పరిధిలోని తుమ్మలకుంట తాండ వర్త్యవత్ దేవి ఇల్లు గురువారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పాటు, సామన్లు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. దేవి వ్యవసాయ పొలం పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె పనినిమిత్తం పొలంలోకి వెళ్లారు. గురువారం సాయంత్రం ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు అంటుకున్నాయి. గ్రామస్తులు నీళ్లతో చల్లార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఇంట్లో ఉన్న మంచం, ఫ్రిడ్జ్, టీవీ, కూలర్, గృహోపకరణాలు, విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ప్రమాదంతో దాదాపు రూ.లక్ష వరకు ఆస్తినష్టం జరిగిందని బాధితులు వాపోయారు. ప్రజాప్రతినిధులు అధికారులు, స్పందించి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పించాలని బాధితురాలు కోరారు.