షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమయిన ఘటన శనివారం లింగాల మండలం దారారం గ్రామంలో చోటుచేసుకుంది.
దిశ, లింగాల : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమయిన ఘటన శనివారం లింగాల మండలం దారారం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. ఆవుల శ్యాంసుందర్ తన సొంత పనుల నిమిత్తం హైదరాబాద్కి వెళ్లాడు. తల్లి ఆవుల కాశమ్మ ఉదయం సమయంలో ఇంటిలో నిద్రిస్తుండగా, ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ జరిగి ఇంటికి ఉన్న రాగి వైరు పూర్తిగా కాలింది. దీంతో ఇంట్లో ఉన్న ఒక టీవీ, ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో కుటుంబంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనలో సుమారు రూ.30 వేల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ బాధితులు అధికారులను కోరారు.