షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటి పరిధిలోని శిర్కే కాలనీలోనీ 963నంబర్ గల సింగరేణి క్వాటర్ లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు పూర్తిగా దగ్ధం అయింది.

Update: 2022-10-17 16:05 GMT

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటి పరిధిలోని శిర్కే కాలనీలోనీ 963నంబర్ గల సింగరేణి క్వాటర్ లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు పూర్తిగా దగ్ధం అయింది. వివరాల్లోకి వెళితే నస్పూర్ మున్సిపాల్టీలోని శిర్కే క్వాటరులో దొంగల శివ కుమార్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. శివ కుమార్ మంచిర్యాలలోని శ్రీరామ్ ఫైనాన్స్ లో పనిచేస్తున్నాడు. అతని భార్య నిండు గర్భిణీ కావడంతో సాయంత్రం ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న వాల్ల అత్తమ్మ ఇంటికి వెళ్ళారు.

కొద్ది సేపటికి వారి ఇంట్లో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని హుటాహుటిన మంటలను పూర్తిగా ఆర్పి ప్రమాద తీవ్రతను తగ్గించారు. ప్రమాదం జరిగిన ఇంట్లో 5 తులాల బంగారు ఆభరణాలు, 50వేల రూపాయల నగదు, టీవీ, వాషింగ్ మెషిన్ తదితర వస్తువులు. ఘటన స్థలానికి చేసుకున్న కుటుంబ సభ్యులు బోరున రోధిస్తున్నారు.

Tags:    

Similar News