ఘోరం.. కన్న కూతురిపై కసాయి తండ్రి అత్యాచారం
కన్న కూతురిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఓ కసాయి తండ్రి కటాకటాలపాలయ్యడు..
దిశ, ఆమనగల్లు: కన్న కూతురిపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఓ కసాయి తండ్రి కటాకటాలపాలయ్యడు. మానవత్వ విలువలు మంట కలిసేలా ప్రవర్తించిన కసాయి తండ్రి తన కూతురిపై పలు మార్లు అత్యాచారం జరిపాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో చోటుచేసుకుంది. ఆమనగల్లు మండల పరిధి ఓ గ్రామంలోని కుటుంబము జీవనోపాధి కోసం 6నెలల క్రితం హైదరాబాదుకు వెళ్లారు. భార్య హోటల్ లో పనికి వెళ్ళేది. కసాయి తండ్రికి ముగ్గురు కూతుర్లు ఉండగా, పెద్ద కూతురు (17)ను కసాయి తండ్రి పని నిమిత్తం తీసుకెళ్లి పలు మార్లు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది.
సంక్రాంతి పండగకి స్వంత గ్రామానికి వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తల్లికి, నానమ్మకు వివరించింది. జరిగిన విషయము గ్రామంలో తెలియడంతో బాధితున్ని ఇరుగుపొరుగు వారు చితకబాధి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బాలికను పరీక్షల నిమిత్తం ఆస్పత్రిక తరలించారు. నిందితుడిని రిమాండ్ కు తరలించనున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి :