రెచ్చిపోయిన హిజ్రాలు.. వ్యక్తిని ఎత్తుకెళ్లి నగ్నంగా వీడియోలు తీస్తూ రాత్రంతా..

ఈ మధ్యకాలంలో కావాలనే కొంత మంది హిజ్రాల వేషాలు ధరించి రద్దీగా ఉన్న ప్లేస్‌‌లలో, హోటల్స్‌లో, కిరాణ షాపుల వద్ద అడుక్కుంటున్నారు.

Update: 2023-01-06 13:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో కావాలనే కొంత మంది హిజ్రాల వేషాలు ధరించి రద్దీగా ఉన్న ప్లేస్‌‌లలో, హోటల్స్‌లో, కిరాణ షాపుల వద్ద అడుక్కుంటున్నారు. అంతే కాకుండా వారు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తే అన్యాయంగా దాడికి దిగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగుళూరులో జరిగింది. డబ్బుల కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి నగ్నంగా వీడియోలు తీసి మరీ లక్షల డబ్బులు గుంజారు హిజ్రాలు. వివరాల్లోకి వెళితే..

ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్(49) బెంగుళూరులో ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే గత నెల 30న ఓ హోటల్‌లో డిన్నర్ చేసి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. అది గమనించిన ఇద్దరు హిజ్రాలు అతడితో మాటలు కలిపి నమ్మించి ఆటో వద్దకు తీసుకెళ్లారు.. అక్కడికి వెళ్లాక అతడిని బలవంతంగా ఆటోలోకి ఎక్కించి ఓ హోటల్‌లో బందించారు. అనంతరం అతడి వద్ద నుంచి వాచ్, విలువైన వస్తువులు లాక్కున్నారు. అంతటితో ఆగకుండా ఆ రాత్రి అంతా హోటల్ గదిలోనే ఉంచి అతడి నగ్న వీడియోలు తీశారు.

డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. దీంతో సదరు వ్యక్తి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా వారికి రూ. 4 లక్షల వరకు చెల్లించాడు. ఇక డబ్బులు అందగానే అతడిని అక్కడే వదిలేసి పరారయ్యారు హిజ్రాలు. అనంతరం శ్రీనివాస్ ఈ ఘటనపై అశోకనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఇటీవల జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి : లోదుస్తుల్లో ఉయ్యాలూగిన బోల్డ్ బ్యూటీ.. వీడియో వైరల్

Tags:    

Similar News