Hero Govinda: బాలీవుడ్ హీరో గోవింద ఇంట్లో గన్ మిస్ ఫైర్... కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్

ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద (Govinda) ఇంట్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-10-01 04:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద (Govinda) ఇంట్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం 4.45కు వ్యక్తిగత పని నిమిత్తం ఆయన కోల్‌కతా వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా.. చేతిలోంచి లైసెన్డ్స్ గన్ కింద పడి లాక్ ఓపెన్ అయి మిస్‌ ఫైర్ అయింది. ఈ క్రమంలో ఓ బుల్లెట్ గోవింద కాలులోకి దూసుకెళ్లగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ముంబైలోని క్రితి కేర్ ఆసుపత్రి (Kriti Care Hospital)కి తరలించారు. అయితే, ప్రస్తుతం గోవింద ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 


Similar News