ఎల్ఐసీ బోనస్ పేరుతో కుచ్చు టోపీ

ఎల్ఐసీ బోనస్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తిని మోసం చేశారు.

Update: 2024-10-11 12:50 GMT

దిశ, కథలాపూర్ : ఎల్ఐసీ బోనస్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తిని మోసం చేశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన బాధితుడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తనను తాను ఎల్ఐసీ ఏజెంట్ గా పరిచయం చేసుకున్న అజ్ఞాత వ్యక్తి బోనస్ వచ్చిందంటూ బాధితుడిని నమ్మించాడు. అయితే బోనస్ గా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని అకౌంట్లో క్రెడిట్ అయినట్లుగా ఓ ఫేక్ మెసేజ్ పంపించాడు.

    మిగతా అమౌంట్ కూడా జమ కావాలంటే తాను చెప్పే సూచనలు పాటించాలని ఫోన్ పే ద్వారా 60 వేల రూపాయలను కొట్టేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి డబ్బులు పోయినట్టు మెసేజ్ రావడంతో ఖంగుతిన్న బాధితుడు మోసపోయినట్టుగా గ్రహించాడు. వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించడంతో పాటు కథలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు ఎలాంటి వ్యక్తిగత సమాచారం, ఓటీపీ లు ఇవ్వకూడదని కథలాపూర్ ఎస్సై నవీన్ సూచించారు. 

Tags:    

Similar News