టీ తాగేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు

టీ తాగేందుకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా మితిమీరిన వేగంతో వచ్చిన బుల్లెట్ బైక్​ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-11-09 13:46 GMT

దిశ, కూకట్​పల్లి : టీ తాగేందుకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా మితిమీరిన వేగంతో వచ్చిన బుల్లెట్ బైక్​ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్​బీ కాలనీ 7వ ఫేజ్​లోని ఎల్​ఐజీ 95లో నివాసం ఉంటున్న కట్ట నర్సింహ మూర్తి(60) స్థానికంగా లేబర్​గా పని చేస్తుంటాడు.

    శనివారం ఉదయం టీ తాగేందుకు రోడ్డు దాటి వెళ్లిన నర్సింహమూర్తి అనంతరం ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా హైటెక్​సిటీ వైపు నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన బుల్లెట్​ బైక్​ ఢీకొట్టింది. దీంతో నర్సింహమూర్తి ఎగిరి పడి తలకు బలమైన గాయం అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, నర్సింహ మూర్తి కొడుకు కట్ట నాగరాజు అందించిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు.


Similar News