పెళ్లి వేడుకకు హాజరైన గ్యాంగ్‌స్టర్ హత్య

భారతసంతికి చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ కెనడాలో దారుణ హత్యకు గురయ్యాడు. కెనడాలో టాప్ 10 గ్యాంగ్‌స్టర్లలో ఒకడైన అమర్ ప్రీత్ సామ్ర అలియాస్ చిక్కీని అతడి ప్రత్యర్థి గ్యాంగ్ బ్రదర్స్ గ్రూప్ సభ్యులు దారుణంగా కాల్చి చంపారు.

Update: 2023-05-29 09:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారతసంతికి చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ కెనడాలో దారుణ హత్యకు గురయ్యాడు. కెనడాలో టాప్ 10 గ్యాంగ్‌స్టర్లలో ఒకడైన అమర్ ప్రీత్ సామ్ర అలియాస్ చిక్కీని అతడి ప్రత్యర్థి గ్యాంగ్ బ్రదర్స్ గ్రూప్ సభ్యులు దారుణంగా కాల్చి చంపారు. ఆదివారం వాంకోవర్ సిటీలో ఈ ఘటన జరిగింది. ఓ పెళ్లివేడుకలో అమర్ ప్రీత్ డ్యాన్స్ చేస్తుండగా దుండగులు కాల్చి చంపారు. కాల్పులు జరిపిన అనంతరం అతని వాహనానికి కూడా నిప్పు పెట్టారు.

సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు అమర్ ప్రీత్‌ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సీపీఆర్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అంబులెన్స్ వచ్చే లోపే అమర్ ప్రీత్ ఊపిరి ఆగిపోయింది. కాగా, అమర్ ప్రీత్ కెనడా పోలీసుల వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న నేరస్థుడని, ఆయన సోదరుడు రవీందర్ కూడా గ్యాంగ్ స్టరేనని అధికారులు తెలిపారు. కాగా, అమర్ ప్రీత్ వర్గానికి, బ్రదర్స్ గ్రూప్ వర్గానికి మధ్య వ్యాపార వ్యవహారాల్లో వైరం ఉంది.

Tags:    

Similar News