మద్యం సేవించి తండ్రీ కొడుకుల గొడవ.. వైన్ షాప్ సూపర్వైజర్ పై దాడి..

వైన్ షాప్ లో మద్యం సేవించి గొడవ పడుతున్న తండ్రీకొడుకులను గొడవ చేయొద్దు అన్నందుకు వైన్ షాప్ సూపర్వైజర్ పై బీర్ బాటిల్ పగలగొట్టి ఛాతిలో పొడిచి దాడి చేసిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-12-19 04:03 GMT

దిశ, మీర్ పేట్ : వైన్ షాప్ లో మద్యం సేవించి గొడవ పడుతున్న తండ్రీకొడుకులను గొడవ చేయొద్దు అన్నందుకు వైన్ షాప్ సూపర్వైజర్ పై బీర్ బాటిల్ పగలగొట్టి ఛాతిలో పొడిచి దాడి చేసిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగరాజ్ తెలిపిన వివరాల ప్రకారం అల్మాస్ గూడ, రాజీవ్ గృహకల్పలో నివాసముండే అడ్డాకుల విజయ్ (50) అతని కుమారుడు అడ్డాకుల కార్తీక్ (25) లు ఇద్దరు కలిసి బుధవారం సాయంత్రం బడంగ్ పేట్ ఎస్‌వీడీ వైన్స్‌లో మద్యం సేవించారు. అంతటితో ఆగకుండా వైన్స్ షాప్ లో గొడవ చేసుకోవడం మొదలు పెట్టారు. అక్కడే ఉన్న వైన్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ వైన్ షాపులో గొడవ చేయొద్దు బయటికి వెళ్ళమని చెప్పాడు.

మద్యం మత్తులో ఉన్న కార్తీక్ బీరు బాటిల్ పగలగొట్టి శ్రీనివాస్ చాతి పై పొడిచాడు. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరగడంతో అక్కడే ఉన్న స్థానికులు మీర్ పేట్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ శ్రీనివాస్ ని బడంగ్ పేట్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ నిందితుడు కార్తీక్ ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.


Similar News