గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి..

జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడు.

Update: 2024-12-19 05:41 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి బంధువుల తెలిపిన వివరాల ప్రకారం మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశం ఓ కేసులో జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మల్లేశం మృతి చెందాడు. గతంలో మల్లేశంకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని అధికారులకు చెప్పినా పట్టించుకోక పోవడంతోనే మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు.


Similar News