మాజీ ఎంపిటిసి శ్రీధర్ గౌడ్ మరణం… ఎమ్మెల్యే కన్నీటి పర్వం

ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామ మాజీ ఎంపీటీసీ శ్రీధర్ గౌడ్ తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొంది శనివారం మృతి చెందాడు.

Update: 2024-12-01 16:34 GMT

దిశ, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామ మాజీ ఎంపీటీసీ శ్రీధర్ గౌడ్ తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొంది శనివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్మోహన్ ఆస్పత్రి వద్దకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను పంపించి.. ఆసుపత్రిలో మృతదేహాన్ని తన సొంత డబ్బులతో ఇంటికి పంపించారు. ఆదివారం కళ్యాణి గ్రామంలో జరిగిన అంత్యక్రియలో ఎమ్మెల్యే మదన్మోహన్ పాల్గొన్నారు. శ్రీధర్ గౌడ్ తన ముఖ్య అనుచరుడని,శాసనసభ ఎన్నికల్లో తన వెంట ఉండి ఎంతో పనిచేశారని, ఆయన మరణం తనను కలిచి వేసిందని ఎమ్మెల్యే మదన్మోహన్ కొనియాడారు. మంచి మనసున్న నాయకుడిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపిటిసి శ్రీధర్ గౌడ్ అంత్యక్రియలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు మండలాలు చెందిన నాయకులు,కార్యకర్తలు, గ్రామస్తులు తదితరుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Similar News