Flight Crash: సౌత్ కాలిఫోర్నియాలో కుప్పకూలిన విమానం.. ఇద్దరు మృతి, 18 మందికి గాయాలు

ప్రపంచ వ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు అందరినీ కలవరపెడుతున్నాయి.

Update: 2025-01-03 04:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు అందరినీ కలవరపెడుతున్నాయి. మొన్నటికి మొన్న కజకిస్థాన్ (Kazakhstan), సౌత్ కొరియా (South Korea) ఫ్లైట్ క్రాష్ (Flight Crash) ఘటనలు మరువక ముందే మరో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియా (Southern California) పరిధిలోని ఆరెంజ్ కౌంటీ (Orange County) నగరం ఫుల్లెర్టన్‌ (Fullerton)లో ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.09 నిమిషాలకు ప్రమాదం జరిగనట్లుగా తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 18 మందికి పైగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలకు అదుపు చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.  

Tags:    

Similar News