AP News:వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు అరెస్ట్

ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా దొంగలతో పాటు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

Update: 2024-09-28 13:28 GMT

దిశ, కాకినాడ: ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా దొంగలతో పాటు మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం విలేకరులతో సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వీరివద్ద నుండి రూ.25 లక్ష‌ల విలువ గల చోరీ సొత్తు, మోటార్ సైకిల్ దొంగతనం కేసుల్లో 8 లక్షల 90 వేల విలువ చేసే 20 మోటార్ సైకిళ్లను రికవరీ చేసినట్లు తెలిపారు. నాలుగు ఇంటి దొంగతనం నేరాలలో కాకినాడ రామకృష్ణారావు పేటకు చెందిన మోజేష్, రాజమహేంద్రవరం నకు చెందిన గాంధీ, కుమార్, దొంగ బంగారం కొన్న తిపర్తి పురుషోత్తమ రామ్ నుండి Rs. 19.39 లక్షల విలువ గల 277 గ్రాముల బంగారంను (77 గ్రాములు రికవరీ చేయాల్సి ఉంది), Rs. 5,40,000/- విలువ గల 6 Kgల వెండిని, 20 వేల మోటార్ సైకిల్‌ను రికవరీ చేశామన్నారు.

వీరిలో ప్రధాన నిందితులు వరసకు అన్నదమ్ములు అయిన ఇసుకలేటి మోజేష్, ఇసుకలేటి గాంధీలు కాకినాడ జిల్లా, ఏలూరు జిల్లాలో రాత్రి సమయంలో ఇంటికి బయట తాళాలు వేసి ఉన్న సదరు ఇళ్ళలోకి దూకి తలుపులు, తాళాలు బద్దలు కొట్టి దొంగతనాలు చేస్తూ సదరు దొంగిలించిన సొత్తును గాంధీకు బావ అయిన తిపర్తి పురుషోత్తమ రామ్ కుమార్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించి ఆ సొమ్ములను జల్సాలు చేసేవారన్నారు. ఇంటి దొంగతనాలలో ప్రధాన ముద్దాయిలు A1, A2, A3 శనివారం రామకృష్ణారావు పేటలోని మోజేష్ ఇంటి వద్ద రాబడిన సమాచారం మేరకు గుర్తించి అరెస్ట్ చేసి వారి నుంచి దొంగిలించిన కొంత సొత్తును, మోటార్ సైకిల్ను స్వాదీన పరుచుకొని ముద్దాయిలను రిమాండ్‌కు పంపామన్నారు.

20 మోటార్ సైకిల్ దొంగతనాల్లో కాకినాడ రాగం పేటకు చెందిన కడగాల యేసు, కొయ్య వారి వీధికి చెందిన గొర్రెల దుర్గాప్రసాద్ వద్ద నుండి 15 కేసులలో 8 లక్షల 90 వేల విలువ గల 20 మోటార్ సైకిల్లను రికవరీ చేశామన్నారు. వీరిలో ప్రధాన నిందుతులు కడగాల యేసు కాకినాడ సిటీ, రూరల్ ఏరియాలలో ఇంటి బయట తాళాలు వేసిన మోటారు సైకిళ్లను మారు తాళాలతో దొంగిలించి వాటిని కొయ్య వారి వీధికి చెందిన గొర్రెల దుర్గా ప్రసాద్ ద్వారా అమ్మి సదరు సొమ్ములను జల్సాలు చేసేవాడని ఎస్పీ చెప్పారు. మోటార్ సైకిల్ ప్రధాన ముద్దాయిలు A1, A2 లను శనివారం కొత్త కాకినాడ శివారులో అరెస్ట్ చేసి వారి నుంచి దొంగిలించిన మోటారు సైకిళ్లు రికవరీ చేసి ముద్దాయిలను రిమాండ్కు పంపడమైనదన్నారు. వీరిని పట్టుకొని రికవరీ చేయటంలో ప్రత్యేక కృషి చేసిన అడిషనల్ ఎస్పీ భాస్కర రావు, కాకినాడ డిఎస్పి రఘువీర్ విష్ణు, ఎస్బి డీఎస్పీ సిహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు, క్రైమ్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ, కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, టు టౌన్ ఇన్స్పెక్టర్ అప్పల నాయుడు, క్రైమ్ సబ్- ఇన్స్పెక్టర్ వినయ్ ప్రతాప్, క్రైమ్ సిబ్బంది ఏఎస్ఐ గోవిందరావు, పుల్లయ్య, ధనరాజు, హెచ్సి- చిన్న, వర్మ, సత్య మూర్తి, మౌళి, నాయుడు, ఐటీ కోర్ సిబ్బంది ప్రసాద్, స్వామిలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.


Similar News