ఫెయిలైన పుష్ప ప్లాన్‌.. రూ.4 కోట్లు ఇచ్చిన తృప్తి చెందలే!

దిశ, వెబ్‌డెస్క్: ఈజీగా మనీ సంపాదించాలనే లక్ష్యంతో కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు.

Update: 2022-08-25 04:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈజీగా మనీ సంపాదించాలనే లక్ష్యంతో కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బున్న వ్యక్తులను గుర్తించి.. వారితో స్నేహం లేదా ప్రేమ పేరుతో ప్రయాణం చేసి చివరకు వారినే బెదిరింపులకు గురిచేసి డబ్బులు లాగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగుళూరులో వెలుగు చూసింది.

పుష్ప అనే యువతి ప్లాన్ ప్రకారం.. ఉద్యాననగరానికి చెందిన ఇండస్ట్రీయలిస్ట్ రవి కుమారుడు సూరజ్‌తో పరిచయం పెంచుకుంది. ఆపై అతడికి మాయమాటలు చెప్పి.. గవర్నమెంట్ నుంచి టెండర్లు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించింది. అనంతరం తన గ్యాంగ్ నుంచి ముగ్గురు వ్యక్తులను సూరజ్‌కు పరిచయం చేసింది. అందులో సంతోష్‌ అనే వ్యక్తి కలెక్టర్ ఆఫీసర్‌ వద్ద కార్యదర్శిగా, మరో ఇద్దరు అర్జున్, రాకేష్‌లకి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో పరిచయం ఉన్నట్లు చెప్పింది. అయితే, ఎంత పెద్ద దొంగైనా ఏదో ఒక రోజు దొరికిపోవడం ఖాయం. అలాగే పుష్ప చెప్పిన మాటలు ఒకదానికి ఒకటి పొంతన లేకపోవడంతో సూరజ్ వారిని సంప్రదించడం మానేశాడు. అయితే ఓ రోజు పుష్ప సూరజ్‌తో మాట్లాడుతుండగా.. ప్లాన్ ప్రకారం వచ్చిన ఆమె గ్యాంగ్..తనపై అత్యాచారం చేస్తున్నావని కేసు పెడతామని బెదిరించి రూ.4 కోట్లు డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే పోలీస్టేషన్‌లో కేసు పెడతామని బెదిరింపులకు పాల్పడింది. దీంతో తన స్నేహితుడికి కాల్ చేసి డబ్బును ఆమెకు అందజేశాడు. అయితే అక్కడితో ఆగని వారి వేధింపులు రోజురోజుకూ పెరిగిపోయాయి. దీంతో సూరజ్ బెంగుళూరులోని శివాజీ నగర్ బ్యాటరాయనపుర పోలీసులను ఆశ్రయించడంతో.. పుష్పతో పాటు ఆమె గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఆఫీసు పనిమీద బయటకు వెళ్లిన భర్త.. ఆ నైట్ కోడలి గదిలో మామ.. చివరికి  


Similar News