ఇంటర్నెట్ సెంటర్లలో ప్రభుత్వం జారీచేసిన పలు సర్టిఫికెట్ల మార్పిడీ..?

జడ్చర్ల కేంద్రంగా ప్రభుత్వం నుంచి జారీ అయిన పలు సర్టిఫికెట్లను నిబంధనలకు విరుద్ధంగా మార్పిడి చేస్తున్నా ఇద్దరు వ్యక్తులను జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Update: 2023-05-11 12:15 GMT

దిశ, జడ్చర్ల: జడ్చర్ల కేంద్రంగా ప్రభుత్వం నుంచి జారీ అయిన పలు సర్టిఫికెట్లను నిబంధనలకు విరుద్ధంగా మార్పిడి చేస్తున్నా ఇద్దరు వ్యక్తులను జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళ్లితే.. జడ్చర్ల పట్టణంలో నిర్వహిస్తున్న రెండు జిరాక్స్ , ఇంటర్నెట్ సెంటర్లలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పాస్ ఫోర్టులలో, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డ్, విద్యార్థుల మెమోలు, ప్రభుత్వ ఉద్యోగుల సర్టిఫికెట్లు, వే బిల్లులలో తదితర సర్టిఫికెట్లలో తేదీలను మార్పిడి చేసి నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు రెండు రోజుల క్రితం జడ్చర్ల పట్టణానికి చెందిన ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు అయిన ఇద్దరిని జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేసి జిల్లా కేంద్రంలో విచారణ చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ విషయం జడ్చర్ల పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. కాగా జడ్చర్ల పట్టణంలో రోజురోజుకు కొత్త కొత్త అక్రమ దందాలు, భూ కబ్జాలు, నకిలీ బంగారు విక్రయాలు, నకిలీ విదేశీ కరెన్సీ విక్రయాలు, జిలేటిక్స్ వ్యాపారంతో పాటు నేడు సర్టిఫికెట్లు మార్పిడి వ్యవహారం కూడా జడ్చర్లలో వెలుగు చూడడంతో పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వ్యవహారం పై టాస్క్ ఫోర్స్ అధికారులు పూర్తి సమాచారం అందించాల్సి ఉంది.

Tags:    

Similar News