సహోద్యోగి భార్యతో అసభ్యకరంగా ఉన్న వీడియోను వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్ చేసిన కానిస్టేబుల్.. ఆ తర్వాత

భాధ్యత గల వృత్తిలో ఉండి మహిళలపై జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవాల్సింది పోయి ఓ కానిస్టేబుల్ నీచంగా ప్రవర్తించాడు..

Update: 2023-01-07 09:48 GMT

దిశ, వెబ్ డెస్క్: భాధ్యత గల వృత్తిలో ఉండి మహిళలపై జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవాల్సింది పోయి ఓ కానిస్టేబుల్ నీచంగా ప్రవర్తించాడు. చాలా మందికి ఆదర్శంగా నిలవాల్సిన అతను అందుకు విరుద్దంగా చేశాడు. రాజధాని ముంబైలో ఓ కానిస్టేబుల్ సహోద్యోగి భార్యతో ఉన్న అశ్లీల వీడియోను ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు.

వివరాల్లోకి వెళితే.. ముంబైలో అభిజిత్ పరాబ్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అయితే అతడు తన సహోద్యోగి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్త లేని సమయంలో ఇద్దరు ఏకాంతంగా కలుస్తూ ఉండేవారు. ఇటీవల ఇద్దరు అసభ్యకరంగా ఉన్న సమయంలో కానిస్టేబుల్ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. అది సదరు మహిళ భర్త కంటపడింది. తన భార్య సహోద్యోగితో ఉండడం చూసి ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే భార్యను మందలించి పరాబ్‌పై ఫిర్యాదు చేయాలని భార్యకు చెప్పాడు. దానికి ఆమె నిరాకరించడంతో పుట్టింటికి పంపేశాడు. ఆ తర్వాత వీడియో కాస్త వైరల్ అయి అధికారుల వరకు చేరడంతో నిందితుడిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.    

Tags:    

Similar News