రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత భార్య మృతి..

మండల పరిధిలోని దేవుని తీర్మాలాపూర్ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల కాంగ్రెస్ నాయకుడు, పెద్ద కొత్తపల్లి సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజు యాదవ్ భార్య మెరుగు అనూష (23) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

Update: 2025-03-17 13:37 GMT
రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత భార్య మృతి..
  • whatsapp icon

దిశ, పెద్ద కొత్తపల్లి : మండల పరిధిలోని దేవుని తీర్మాలాపూర్ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల కాంగ్రెస్ నాయకుడు, పెద్ద కొత్తపల్లి సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజు యాదవ్ భార్య మెరుగు అనూష (23) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మండలంలోని పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ నాయకుడు మెరుగు రాజు యాదవ్ తన భార్య, మూడేళ్ల బాబుతో కలిసి పని మీద వనపర్తి కి బైక్ మీద వెళ్లారు. బైక్ మీద స్వగ్రామమైన పెద్ద కార్పా ములకు తిరుగు ప్రయాణంలో మండల పరిధిలోని దేవుని తీర్మాలాపూర్ సమీపంలో మామిడి తోట వద్ద వస్తుండగా ఎదురుగా పెద్ద కొత్తపల్లి వైపు నుంచి వేగంగా వెళ్తున్న బైక్ ను తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.

ఈ ప్రమాదంలో మెరుగు అనూష తలకు బలమైన గాయాలై అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. రాజు యాదవ్ తో పాటు బాబుకు స్వల్ప గాయాలైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తమ నాయకుడు రాజు యాదవ్ తన భార్యను కోల్పోయిన సంఘటనతో దిగ్భ్రాంతికి గురైన మండల కాంగ్రెస్ నాయకులు సోమవారం గ్రామానికి వెళ్ళి రాజును పరామర్శించి బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు జూపల్లి అరుణ్, దండు నర్సింహ, మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్, చంద్రయ్య యాదవ్ తదితరులు పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. అనంతరం సాయంత్రం గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో వారు పాల్గొన్నారు.


Similar News