కీచక ఉపాధ్యాయుడుపై పోలీసులకు ఫిర్యాదు..
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఎస్.రావు నగర్ లోని
దిశ,కాప్రా : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఎస్.రావు నగర్ లోని సదాశివ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థినిలతో ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినిలు, తల్లిదండ్రులు, ఏఐవైఎఫ్, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగారు. పదో తరగతి చదువుతున్న విద్యార్తినులపై ప్రధానోపాధ్యాయుడు బొర్రా నాగేందర్ రావు చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థినిలు ఆరోపించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో విద్యార్థినిలు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన నాగేందర్ రావును కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. గత కొన్ని ఏళ్లుగా పాఠశాల ప్రిన్సిపాల్ నాగేందర్ రావు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది.