కారు అద్దాలు పగలగొట్టి డబ్బులు చోరీ

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బస్టాండ్ పక్కన గల ఎస్బీఐ బ్యాంక్ ప్రాంగణంలో ఆగి ఉన్న కారు అద్దాలు పగలగొట్టి దాదాపు రూ.లక్ష 80 వేలు చోరీ చేసిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.

Update: 2024-11-20 11:20 GMT

దిశ,భైంసా : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బస్టాండ్ పక్కన గల ఎస్బీఐ బ్యాంక్ ప్రాంగణంలో ఆగి ఉన్న కారు అద్దాలు పగలగొట్టి దాదాపు రూ.లక్ష 80 వేలు చోరీ చేసిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... లోకేశ్వరం మండలం గడిచందా గ్రామానికి చెందిన అల్లం భోజన్న బీడీ కంపెనీ నిర్వహిస్తుంటాడు.

     బీడీ వర్కర్లకు పేమెంట్ నిమిత్తం నిర్మల్ రహదారిలో గల ఎస్బీఐ బ్యాంక్ నుండి 90 వేల రూపాయలను విత్ డ్రా చేశాడు. అలాగే మరో 90 వేల రూపాయలు బ్యాగ్ లో ఉన్నాయి. మొత్తం లక్షా 80 వేలు కారులో ఉంచాడు. ఇది గమనించిన దుండగులు కారు అద్దాలు పగలగొట్టి బ్యాగులో ఉన్న డబ్బులు ఇతర వస్తువులను దొంగిలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా బస్టాండ్ పక్కన గల బ్యాంకులో పెద్ద నోట్లను, చిన్న నోట్లుగా మార్చుకోవడానికి బాధితుడు వచ్చినట్టు తెలిపాడు. 


Similar News