దారుణం.. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం
తమ కూతుర్లు రెండు రోజులుగా కనిపించడం లేదని మచ్చబొల్లారంనకు చెందిన బాలికల తల్లిదండ్రులు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దిశ, అల్వాల్ : తమ కూతుర్లు రెండు రోజులుగా కనిపించడం లేదని మచ్చబొల్లారంనకు చెందిన బాలికల తల్లిదండ్రులు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా బాలికల ఆచూకీ దొకినట్లు ఇన్ స్పెక్టర్ రాహుల్ దేవ్ తెలిపారు. దమ్మాయిగూడకు చెందిన ఆకుల సాత్విక్(26) కాప్రాకు చెందిన మోహన్ చంద్ (20) ప్రైవేట్ ఎంప్లాయి.
వీరు ఇద్దరికి ఇన్ స్టాగ్రామ్ లో బాలికలు పరిచయం అయ్యారు. వారికి మాయమాటలు చెప్పిన ఇరువురు యువకులు మూడు రోజుల క్రితం అమ్మాయిలను తీసుకుని ఈసీఐఎల్ వద్దగల ఓయో రూమ్ లో గడిపినట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మైనర్లను తల్లిదండ్రులకు అప్పగించి యువకులపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.