Crime News: సంగారెడ్డిలో దారుణ హత్య.. శవాన్ని ఈడ్చుకెళ్లి..
తన పశువుల కోసమని తెచ్చిపెట్టుకున్న గడ్డిని వేరొకరు తమ పశువులతో రోజు మేపుతున్నారు. ఇదేమిటని అడగడానికి వెళ్లిన వ్యక్తిని తండ్రి, కొడుకులు ఇద్దరు కలిసి అతడిని అతి దారుణంగా హత్య చేశారు.
దిశ, కంది: తన పశువుల కోసమని తెచ్చిపెట్టుకున్న గడ్డిని వేరొకరు తమ పశువులతో రోజు మేపుతున్నారు. ఇదేమిటని అడగడానికి వెళ్లిన వ్యక్తిని తండ్రి, కొడుకులు ఇద్దరు కలిసి అతడిని అతి దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా శవాన్ని ఈడ్చుకు వెళ్లి తగలబెట్టి తగలబెట్టి అతడి ద్విచక్ర వాహనాన్ని సైతం తగలబెట్టారు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రం కూతవేటు దూరం లోని కలబ్ గుర్ గ్రామంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి రూరల్ సీఐ శివలింగం వెల్లడించారు.
పారతో కొట్టి చంపి.. ఆ తర్వాత శవాన్ని తగలబెట్టారు సంగారెడ్డి మండలం కలబ్ గుర్ గ్రామానికి చెందిన గూడెపు పాండు (38) స్థానికంగా పాల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే పాండు తన వద్ద ఉన్న పశువులకు మేత కోసం గడ్డిని తెచ్చి పెట్టేవాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన తండ్రి అయిన అక్తర్, కొడుకు ఇస్మాయిల్ లు తమ పశువులతో పాండు తెచ్చిపెట్టిన గడ్డి మేతను రోజు తినిపిస్తున్నారు. ఇదే విషయాన్ని పాండు వారిద్దరిని అడగడానికి వారి ఇంటికి వెళ్లగా అక్తర్, ఇస్మాయిల్ లు ఇద్దరు కలిసి పారతో పాండును కొట్టి, త్రాడుతో మెడకు వేసి గుంజి చంపారు.
చంపిన తర్వాత పాండు శవాన్ని కొద్ది దూరం గుంజుకుని పోయి ఊరి చివరన గల ఇర్గిపల్లి వెళ్ళే రోడ్డు ప్రక్కన సర్కార్ పొదలలో పడేసి శవం పై పెట్రోల్ పోసి తగలబెట్టారు. అనంతరం పాండుకు చెందిన మోటార్ సైకిల్‌ను కూడ తగలబెట్టరు. మృతుని భార్య ఫితన పశువుల కోసమని తెచ్చిపెట్టుకున్న గడ్డిని వేరొకరు తమ పశువులతో రోజు మేపుతున్నారు. ఇదేమిటని అడగడానికి వెళ్లిన వ్యక్తిని తండ్రి, కొడుకులు ఇద్దరు కలిసి అతడిని అతి దారుణంగా హత్య చేశారు.దు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఇద్దరిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇద్దరిని రిమాండ్‌కు కూడా తరలించడం జరుగుతుందని సీఐ శివలింగం తెలిపారు.