పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. యువతి ఆత్మహత్య
ఏడేళ్లుగా ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నవీపేట్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.
దిశ, నవీపేట్: ఏడేళ్లుగా ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నవీపేట్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన హరిణి (25), అక్తర్ గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. హరిణి పెళ్లి విషయమై అడగగా నిరాకరించడం, ఇతర విషయాల్లో తరచుగా ఇబ్బంది పెట్టడంతో హరిణి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు బెడ్ షీట్ తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఎన్నేడ్ల దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.