ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి

ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో బాలుడు మృతి చెందిన ఘటన అక్కన్నపేట మండలం సోమాజి తాండలో బుధవారం చోటుచేసుకుంది.

Update: 2023-05-17 11:28 GMT
ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి
  • whatsapp icon

దిశ. హుస్నాబాద్ : ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో బాలుడు మృతి చెందిన ఘటన అక్కన్నపేట మండలం సోమాజి తాండలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. అక్కన్నపేట మండలం సోమాజితాండకు చెందిన ధరావత్ రాజు తన కుమారుడు తరుణ్ (12)తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. నందారం స్టేజి వద్దకు రాగనే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ రాజు బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తరుణ్ కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి రాజకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అక్కన్నపేట ఎస్సై వివేక్ ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్ట మార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News