Bouncer Murder: తెనాలిలో దారుణం.. పవన్ కల్యాణ్ బౌన్సర్ హత్య

పవన్ కల్యాణ్ సహా.. పలువురు సెలబ్రిటీల వద్ద బౌన్సర్ గా పనిచేసిన వ్యక్తి తెనాలిలో దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ లో ఉంటున్న కోటేశ్వరరావు 15 రోజుల క్రితమే స్వగ్రామం బుర్రిపాలెంకు వెళ్లాడు.

Update: 2024-10-02 05:10 GMT

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కోటేశ్వరరావు అనే వ్యక్తి పీక కోసి చంపి.. పరారయ్యారు. ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా.. పలువురు సినీ సెలబ్రిటీలు, వీఐపీల వద్ద కోటేశ్వరరావు బౌన్సర్ గా, పోలీసుల వద్ద ప్రైవేటు డ్రైవర్ గా పనిచేశాడని స్థానికులు చెబుతున్నారు. వృత్తిరీత్యా హైదరాబాద్ లోనే ఉంటోన్న అతను.. 15 రోజుల క్రితమే సొంతూరు బుర్రిపాలెంకు వచ్చాడని, ఇంతలోనే ఇలా హత్యకు గురయ్యాడని పేర్కొన్నారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గత రాత్రి కోటేశ్వరరావు మద్యం మత్తులో ఉన్న సమయంలోనే హత్య చేశారని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. బుర్రిపాలెం రోడ్డులో ఈ హత్య జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కోటేశ్వరరావును ఎవరు, ఎందుకు హత్య చేశారు ? స్నేహితులు చంపారా, కుటుంబ సభ్యుల పనేనా ? హత్యకు దారితీసిన కారణాలేంటి ? ఎవరితోనైనా ఎఫైర్ ఉందా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 


Similar News