వరంగల్‌లో దారుణం.. మైనర్‌ను గర్భవతిని చేసిన వృద్ధుడు

వరంగల్ జిల్లా గీసుకొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Update: 2024-10-01 17:25 GMT

దిశ, గీసుగొండ: వరంగల్ జిల్లా గీసుకొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. గీసుకొండ మండలంలోని మనుగొండ గ్రామానికి చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధుడి భార్య చనిపోగా ఒంటరిగా జీవిస్తున్నాడు. తన ఇంటి దగ్గరలో నివాస ముంటున్న ఓ పదకొండేళ్ల బాలికను లొంగదీసుకొని పలుమార్లు అత్యాచారం చేసినట్లు సమాచారం. దీంతో సదరు బాలిక గర్భం దాల్చినదని తెలుస్తున్నది. ఇటీవల కడుపునొప్పిగా ఉందని తల్లిదండ్రులతో చెప్పడంతో వారు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలిక గర్భం దాల్చిందని చెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News