గల్లంతైన మహిళ మృతదేహం లభ్యం

వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామపంచాయతీ పరిధిలోని రావువారి గూడెం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ అనూష ఈ నెల 4న మండలంలోని రావులపెంట సమీపంలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతైంది.

Update: 2024-10-08 14:26 GMT

దిశ, వేములపల్లి : వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామపంచాయతీ పరిధిలోని రావువారి గూడెం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ అనూష ఈ నెల 4న మండలంలోని రావులపెంట సమీపంలో సాగర్ ఎడమ కాలువలో గల్లంతైంది. కాగా ఆమె మృతదేహం గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామ చెరువులో మంగళవారం లభ్యమైనట్లు ఎస్సై డి.వెంకటేశ్వర్లు తెలిపారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Tags:    

Similar News