శుక్రవారం మృతి.. ఆదివారం బయటపడ్డ మృతదేహం

అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్న గ్యాస్ గోదాం ఇన్‌చార్జ్ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2023-05-22 07:46 GMT

దిశ, బెజ్జూర్ : అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్న గ్యాస్ గోదాం ఇన్‌చార్జ్ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా, తాడువాయి మండలం, కన్నెబోయినపల్లి గ్రామానికి చెందిన సాయం జగన్నాథరావు (59) బెజ్జూర్ మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ గోదాం ఇంచార్జిగా గత మూడేళ్లుగా పని చేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం విధులు ముగించుకొని స్థానికంగా ఉంటున్న అద్దె ఇంటికి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన బయటకు రాలేదు. ఆదివారం అటుగా వెళ్లిన స్థానికులకు దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్‌కు సమాచారం అందించారు.

యజమాని వచ్చి పరిశీలించగా ఇంటి లోపలి నుంచి గడియ పెట్టి ఉండటం, తీవ్రమైన దుర్వాసన వస్తుండటంలో గ్యాస్ గోదాం కంప్యూటర్ ఆపరేటర్ నరేందర్‌కు సమాచారం అందించారు. అనంతరం అందరూ కలిసి ఇంటి తలుపులు పగలకొట్టి చూడగా.. జగన్నాథరావు మృతి చెంది కుళ్లిపోయిన స్థితిలో కనిపించాడు. వెంటనే బెజ్జూర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై వెంకటేష్ పరిసరాలను పరిశీలించారు. ఎండ తీవ్రతకు మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇల్లు శివారు ప్రాంతంలో ఉండటంతో ఎవరూ గమనించకపోవడంతోనే మృతిదేహం కుళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. జగన్నాథరావు మృతి చెందిన సమాచారాన్ని పోలీసులు కుటుంబీలకు అందించారు.

Read More:   విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని తాత, మనవరాలు మృతి 

Tags:    

Similar News