అధ్యాపకుడు కించపరిచాడని ఆత్మహత్యాయత్నం

చిల్డ్రన్స్ డే రోజు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మార్కులు తక్కువ వచ్చాయని ఉపాద్యాయులు అందరి ముందు కించపరచడంతో గురువారం ఇంటర్ విద్యార్థిని పురుగులమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడి.

Update: 2024-11-14 13:31 GMT

దిశ, వెల్గటూర్ : చిల్డ్రన్స్ డే రోజు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మార్కులు తక్కువ వచ్చాయని ఉపాద్యాయులు అందరి ముందు కించపరచడంతో గురువారం ఇంటర్ విద్యార్థిని పురుగులమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడి. ఈ ఘటన వెల్గటూర్ మండలంలో చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని మోడల్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది.

     ఇటీవల నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఓ సబ్జెక్టు అధ్యాపకుడు సహచర విద్యార్థుల ముందు అవహేళనకు గురిచేసినట్లు సమాచారం. ఈ మేరకు తీవ్ర మనస్థాపానికి లోనైనా విద్యార్థిని గురువారం వారి ఇంటి వద్ద గొర్రెలకు వేసే నట్టల మందును సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. విషయాన్ని గమనించిన తండ్రి ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News