దారుణం.. నడి రోడ్డుపై దాడి చేసి మహిళ శరీరాన్ని పీక్కుతిన్న కుక్కలు..
వీధి కుక్కలు చిన్నారులతో పాటు పెద్దలపై దాడుల చేస్తూ ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: వీధి కుక్కలు చిన్నారులతో పాటు పెద్దలపై దాడుల చేస్తూ ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. కుక్కల భయంతో జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, మధ్యప్రదేశ్లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీధి కుక్కలు 55 ఏళ్ల మహిళపై దాడి చేసి చంపేసి శరీరాన్ని పీక్కుతిన్నాయి.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ముంద్రాయి గ్రామానికి చెందిన ఓ మహిళ శనివారం ఉదయం పొలానికి వెళ్తుంది. ఆ సమయంలో ఓ చెట్టు కింద వీధి కుక్కల గుంపు ఆమెను చుట్టుముట్టి మహిళపై దాడి చేశాయి. అంతటితో ఆగకుండా ఆమె శరీరాన్ని అక్కడే పీక్కుతినడం ప్రారంభించాయి. అది గమనించిన కొందరు గ్రామస్తులు వాటిని తరిమి కొట్టి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టంకు ఆసుపత్రికి తరలించారు.