దారుణం.. ఇద్దరు వాచ్‌మెన్ల దారుణ హత్య

గుంటూరు పట్టణంలో మంగళవారం అర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు.

Update: 2023-03-01 07:33 GMT

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు పట్టణంలో మంగళవారం అర్థరాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగతనానికి అడ్డుగా ఉన్నారని ఇద్దరు వాచ్ మెన్లను కిరాతకంగా హత్య చేశారు. గుంటూరు పట్టణ ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ బైక్ షోరూం, అరండల్ పేటలోని లిక్కర్ మార్ట్ వద్ద పనిచేసే వాచ్ మెన్లు దొంగల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. షోరూంలోని బైక్స్ దొంగిలించేందుకు యత్నించిన దొంగల ముఠా వాచ్ మెన్‌ను బలమైన ఆయుధంతో తలపై తీవ్రంగా కొట్టారు.

దీంతో రక్తపు మడుగులో పడి వాచ్ మెన్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే బైక్స్ దొంగిలించేందుకు విశ్వప్రయత్నం చేయగా సాధ్యపడకపోవడంతో దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం అరండల్ పేటలోని లిక్కర్ మార్ట్ ను దోచుకునేందుకు కూడా దొంగలు ప్రయత్నించారు. అక్కడ కూడా అడ్డొచ్చిన వాచ్ మెన్ పై దాడి చేసి హత్య చేశారు. అనంతరం మార్ట్ లోకి చొరబడి మద్యం బాటిళ్లు దోచుకెళ్లారు. ఈ రెండు ఘటనలతో గుంటూరులో భయానక వాతావరణం నెలకొంది.  

Tags:    

Similar News