బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్
ఖిలా వరంగల్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒకరిని వరంగల్
దిశ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒకరిని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు. పడమర కోటకు చెందిన తాడెం భరత్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని పక్క సమాచారం తో వరంగల్‌లోని పిఎస్ మిల్స్ కాలనీ పరిధిలోకి వచ్చి, అతను Cricketbet.99.com ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పట్టుకున్నారు.సీఐ రంజిత్, ఎస్సై దిలీప్ పోలీసు బృందంతో కలిసి తనిఖీలు చేశారు. రెండు మొబైల్స్ , రూ. 2, 46, 700 నగదును స్వాధీనం చేసుకొని విచారణ కోసం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు.