కేసముద్రం రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

కేసముద్రం రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అయితే ఆ వ్యక్తిని హత్య చేసి పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2024-11-14 09:56 GMT

దిశ,కేసముద్రం: కేసముద్రం రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అయితే ఆ వ్యక్తిని హత్య చేసి పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి… కేసముద్రం రైల్వే స్టేషన్ ఫస్ట్ ఫ్లాట్ ఫామ్ వైపు రైల్వే ఆవరణలోని టికెట్ కౌంటర్ మెట్లు ఎక్కుతున్న వైపు మొక్కలను పెంచే లాన్ పిట్ట గోడపై ఓ వ్యక్తి తల పగిలి తీవ్రగాయాలతో మృతి చెంది ఉన్నాడు. గుర్తు తెలియని వ్యక్తి మృతి అనుమానాస్పదంగా ఉండడంతో, అతడిని హత్య చేసి కేసముద్రం రైల్వే స్టేషన్ ఆవరణలో పడేసి ఉంటారనే అనుమానం వ్యక్తం అవుతుంది. కాగా ఈ విషయమై స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం మృతుడి ది రాజనపల్లి గ్రామం రవీందర్ గా తెలియవచ్చింది. పోలీసులు విచారణ చేపట్టారు.


Similar News