గుర్తు తెలియని మృతదేహం లభ్యం...
లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మగ మృతదేహం లభించింది. ఎస్సై సీనయ్య వివరాల ప్రకారం
దిశ,కార్వాన్ : లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మగ మృతదేహం లభించింది. ఎస్సై సీనయ్య వివరాల ప్రకారం.. లంగర్ హౌజ్ లోని ఎస్ బి ఐ బ్యాంకు వద్ద సోమవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి( 35) పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.