మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య..
మద్యానికి బానిసై.. జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దిశ, నస్పూర్ : మద్యానికి బానిసై.. జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నస్పూర్ పట్టణంలో శనివారం జరిగింది. శ్రీరాంపూర్ ఎస్సై మానస తెలిపిన వివరాల ప్రకారం నస్పూర్ పట్టణంలోని 8వ వార్డు తాళ్లపల్లిలో అగ్గు సుధాకర్ (43) అనే వ్యక్తి హమాలీ పని చేస్తూ జీవనం సాగిస్తుండే వాడన్నారను.
గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిస అయ్యాడని తెలిపారు. జీవితం మీద విరక్తి చెంది తాగిన మైకంలో శనివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని భార్య వనిత ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మానస తెలిపారు.