దొంగతనానికి పాల్పడ్డ నిందితుడు అరెస్ట్

మండల కేంద్రంలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితుడు సీసీఎల్ (16) ను అరెస్టు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ శనివారం తెలిపారు.

Update: 2025-01-04 12:24 GMT

దిశ, బోథ్ : మండల కేంద్రంలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితుడు సీసీఎల్ (16) ను అరెస్టు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బోథ్ బస్టాండ్ సమీపంలోని సూర్యవంశి ఉలాజి అనే వ్యక్తి ఈ నెల రెండవ తేదీన తన పొలం పనుల కోసమని తన ఇంటికి తాళం వేసి వెళ్లాడు. కాగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో పొలం పనులు ముగించుకొని ఇంటికి రాగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. తన ప్యాంటు జేబులో ఉంచిన పది వేల రూపాయల నగదు సైతం లేకపోవడంతో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాధితుడు ఇంటిపై అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితున్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి పది వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News