ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం...ఒకరు మృతి

ఫార్మా కంపెనీలో బాయిలర్ శుభ్రం చేస్తుండగా అగ్నిప్రమాదం జరిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-11-20 10:25 GMT

దిశ, పేట్ బషీరాబాద్ : ఫార్మా కంపెనీలో బాయిలర్ శుభ్రం చేస్తుండగా అగ్నిప్రమాదం జరిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఫేస్ ఫోర్ నర్సాపూర్ ప్రధాన రహదారిలో అరోర్ ఫార్మా పరిశ్రమ ఉంది. ఇందులో పనిచేస్తున్న అనిల్ (43) అనే కార్మికుడు బాయిలర్ శుభ్రం చేస్తున్న క్రమంలో సాల్వెంట్ ఫైర్ అవడంతో మంటలు వ్యాపించాయి.

    ఈ ఘటనలో అనిల్ తీవ్రంగా గాయపడి మృతి చెందగా మరో ముగ్గురు కార్మికులు సైతం గాయపడి చికిత్స పొందుతున్నారు. కంపెనీలో ప్రమాదం జరిగిన సంఘటనను అరోర్ ఫార్మా కంపెనీ యాజమాన్యం బయటకు పొక్కకుండా గుట్టు చప్పుడు కాకుండా కార్మికులను నగరంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు కంపెనీ వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. 


Similar News