Accident : కారు బైక్ ఢీ.. బాలుడు మృతి
కారు - బైక్ ఢీకొన్న ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన
దిశ, నిజాంపేట: కారు - బైక్ ఢీకొన్న ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన నిజాంపేట మండలం లో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. జడ్చెరువు తండా కు చెందిన శతృ తన కుమారుడు అర్జున్ ను గాంధారి హాస్టల్ నుండి ఇంటికి బైక్ పై తీసుకు వస్తున్నాడు. సిద్దిపేట నుంచి రామాయంపేట వైపు వెళుతున్న ఓ కారు నందిగామ గ్రామ శివారులో బైక్ ను ఢీకొనడంతో అర్జున్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కంటి ముందే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తో బోరున విలపించాడు.