కాశ్మీర్ యువతి ఆత్మహత్య.. ప్రియుడు నిరాకరించడంతో..

ప్రియుడు మాట్లాడటం లేదని మనస్తాపానికి గురైన కాశ్మీర్ యువతి

Update: 2024-11-12 06:00 GMT

దిశ, ఖైరతాబాద్ : ప్రియుడు మాట్లాడటం లేదని మనస్తాపానికి గురైన కాశ్మీర్ యువతి ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె వివరాలు ఎలా ఉన్నాయి.. జమ్ము- కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా మాలపొర గ్రామానికి చెందిన ఇరోమ్ నబీ దార్ (23) బ్యాంక్ ఆఫ్ అమెరికాలో శాంపిల్ ఎగ్జిక్యూషన్ అనలిస్ట్ గా పనిచేస్తుంది. విధి నిర్వహణలో భాగంగా ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ కు బదిలీపై వచ్చింది. అప్పటి నుంచి టోలిచౌ కీలోని ఎండీ లెన్స్ లో సమీప బంధువు అబ్దుల్ మోగ్ని ఉంటున్న అపార్టుమెంట్లో ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా జమ్మూ- కాశ్మీర్ కు చెందిన ఓ యువకుడితో ఆమె ప్రేమలో ఉంది. ప్రతి రోజు డ్యూటీ ముగిసిన తర్వాత ప్రియుడి తో మాట్లాడుతున్నది. అయితే, కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి.

రెండు రోజుల కిందట ఫోన్ చేయగా.. ప్రియుడు సరిగా మాట్లాడకపోవటంతో తన గదిలో బెడ్ షీట్ తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆన్లైన్ లాగిన్ కావాల్సిన ఇరామ్ నబీ దార్ మధ్యాహ్నం దాటిన లాగిన్ కాకపోవడంతో బ్యాంక్ ఆఫ్ అమెరి కాలో ఆమెతో పాటు పనిచేస్తున్న అక్షయ్ (మేనేజర్) పలుమార్లు కాల్ చేశాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె బంధువుల లిస్టులో ఉన్న రూమ్మేట్ అబ్దుల్ మోగ్నికి సమాచారమిచ్చాడు. దీంతో అతడు ఇంటికి వెళ్లి చూడగా, గదిలో ఉరేసుకుని ఇరామ్ నబీ దార్ కనిపించింది. ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందించారు, 108 అంబులెన్స్ ని పిలిపించారు. పరీక్షించిన 108 సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఫిల్మ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Similar News