భార్యతో గొడవ.. మద్యం మత్తులో భర్త చేసిన పని ఇదే! (వీడియో)
ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఫ్లైఓవర్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన బాలానగర్‌లో వెలుగుచూసింది. ఎస్.ఆర్. నగర్‌లోని బాపునగర్‌కు చెందిన భూక్యా అశోక్(36) వెల్డింగ్ పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఫ్లైఓవర్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన బాలానగర్‌లో వెలుగుచూసింది. ఎస్.ఆర్. నగర్‌లోని బాపునగర్‌కు చెందిన భూక్యా అశోక్(36) వెల్డింగ్ పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. అతని మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా.. కొంతకాలం తర్వాత రుక్సానా బేగం అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రోజు తాగొచ్చి భార్యను వేధిస్తూ.. చనిపోతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటలకే మద్యం తాగుడు మొదలుపెట్టిన అశోక్.. భార్య రుక్సానా బేగంతో గొడవకు దిగాడు.
అనంతరం రుక్సానా బేగంను చితకబాదాడు. తర్వాత చనిపోతానని చెప్పి మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు బాలానగర్ఫ్లై ఓవర్ పైనుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ అశోక్‌ను గాంధీకి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మద్యం మత్తులో అశోక్ సూసైడ్ చేసుకున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ - భార్యతో గొడవపడి మద్యం మత్తులో బాలా నగర్ ఫ్లై ఓవర్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడు. pic.twitter.com/QIBcHz2RaA
— Telugu Scribe (@TeluguScribe) June 6, 2023