అప్పుల బాధ భరించలేక యువ రైతు ఆత్మహత్య

దిలావర్పూర్ మండలంలోని బాన్సపల్లి గ్రామంలో మస్తా సంతోష్ (36) అనే యువ రైతు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

Update: 2024-11-10 12:20 GMT

దిశ, దిలావర్పూర్ : దిలావర్పూర్ మండలంలోని బాన్సపల్లి గ్రామంలో మస్తా సంతోష్ (36) అనే యువ రైతు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల రెండవ తేదీ సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సంతోష్ ఆచూకీ కోసం తండ్రి జయరాజ్, కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో గాలించారు.

    ఆదివారం బాన్సపల్లి గ్రామం పక్కన ఉన్న చిన్న చెరువు దగ్గర పొలంలో కుళ్లిపోయిన శవం కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ సందీప్, గ్రామస్తులతో కలిసి శవాన్ని పరిశీలించి మస్తా సంతోష్ గా నిర్ధారించారు. మృతుడికి భార్య, 2 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. మృతుని తండ్రి జయరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సందీప్ తెలిపారు. 


Similar News