హైదరాబాద్‌లో దారుణం.. కారు కిందపడి మూడేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. బుధవారం రాత్రి కారు కింద పడి ఓ మూడేళ్ల చిన్నారి మృతి చెందింది.

Update: 2023-05-24 16:22 GMT
హైదరాబాద్‌లో దారుణం.. కారు కిందపడి మూడేళ్ల చిన్నారి మృతి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. బుధవారం రాత్రి కారు కింద పడి ఓ మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాల ప్రకారం.. నగర శివారులోని హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ వద్ద మూడేళ్ల చిన్నారి లక్ష్మీ కారు కిందపడి మరణించింది. కారు రివర్స్ తీస్తున్న సమయంలో డ్రైవర్ గమనించకపోవడంతో లక్ష్మీ కారు కిందపడి పోయింది. కారు చిన్నారి మీద నుండి వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై లక్ష్మీ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News