ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేటు బస్సు నదిలో పడి 15 మంది మృతి..!

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం శ్రీఖండి నుంచి ఇండోర్‌ వెళ్తున్న ఓ ప్రైవేట్ ప్యాసింజర్ బస్సు ఖార్గోన్‌ జిల్లాలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది.

Update: 2023-05-09 05:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం శ్రీఖండి నుంచి ఇండోర్‌ వెళ్తున్న ఓ ప్రైవేట్ ప్యాసింజర్ బస్సు ఖార్గోన్‌ జిల్లాలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది.నదిపై ఉన్న వంతెన రెయిలింగ్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేలు చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News