పామును కరకర నమిలి మింగిన మూడేళ్ల బాలుడు.. చివరికి ఏమైందంటే?
ఓ మూడేళ్ల బాలుడు తనను కరవడానికి వచ్చిన పామును కరకర నమిలి మింగేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫరూకాబాద్ లో జరిగింది.
దిశ, వెబ్ డెస్క్: ఓ మూడేళ్ల బాలుడు తనను కరవడానికి వచ్చిన పామును కరకర నమిలి మింగేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫరూకాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఫరూకాబాద్ లో అక్షయ్ అనే ఓ మూడేళ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఓ చిన్న పాము అతడిని కరవడానికి వచ్చింది. అయితే అదేదో తినే వస్తువు అనుకొని ఆ పామును నోట్లో పెట్టుకొని నమలడం ప్రారంభించాడు ఆ బాలుడు. అయితే కొంతసేపటికి గొంతులో నొప్పి అనిపించడంతో ఆ బాలుడు గట్టిగా ఏడ్వడం ప్రారంభించాడు.
దీంతో ఇంట్లో ఉన్న ఆ పసివాడి నానమ్మ పరుగెత్తుకొంటి బయటకు వచ్చి బాలుడి నోట్లో పాము ఉండటంతో భయంతో వణికిపోయింది. వెంటనే వచ్చి అతి కష్టం మీద అతడి నోట్లో నుంచి పామును బయటకు లాగింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆ చిన్నారిని స్థానికంగా ఉండే ఓ డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా.. అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ బాబుకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.