జీవితం మీద విరక్తితో వ్యక్తి బలవన్మరణం
మండలంలోని బతికేపల్లి గ్రామానికి చెందిన బొమ్మెన రాజయ్య(46) అనే వ్యక్తి అనారోగ్య సమస్యల వల్ల జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
దిశ,పెగడపల్లి : మండలంలోని బతికేపల్లి గ్రామానికి చెందిన బొమ్మెన రాజయ్య(46) అనే వ్యక్తి అనారోగ్య సమస్యల వల్ల జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసు కున్నాడు. ఎస్సై రవి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం రాజయ్య అనారోగ్య సమస్యల వల్ల సతమతం అవుతూ పురుగుల మందు తాగగా కరీంనగర్ లోని ప్రతిమ ఆసుపత్రికి చికిత్స కోసం పంపగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించాడు. అతని భార్య సత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.