Crime News : ఇనుప రాడ్ తో పొడుచుకున్న సైకో.. చికిత్స పొందుతూ మృతి..

కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో గత శుక్రవారం సాయంత్రం సుమారు 19 ఏళ్ల గుర్తు తెలియని యువకుడు ఇనుప రాడ్, బీరుసీసాను పగలగొట్టి తనకు తానే పొడుచుకున్నాడు.

Update: 2024-10-28 08:01 GMT
Crime News : ఇనుప రాడ్ తో పొడుచుకున్న సైకో.. చికిత్స పొందుతూ మృతి..
  • whatsapp icon

దిశ, కేసముద్రం : కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో గత శుక్రవారం సాయంత్రం సుమారు 19 ఏళ్ల గుర్తు తెలియని యువకుడు ఇనుప రాడ్, బీరుసీసాను పగలగొట్టి తనకు తానే పొడుచుకున్నాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళనకు గురై కేసముద్రం పోలీసులకు సమాచారం అందించారు.

ఇనుప రాడ్తో పొడుచుకోవడంతో పొట్టలో తలపై, తీవ్ర గాయాలయ్యాయి. యువకుడిని ప్రశ్నించగా పశ్చిమ బెంగాల్ పేరు తప్ప మిగతా వివరాలేమీ వెల్లడించడం లేదని పోలీసులు తెలిపారు. పోలీసులు అతడిని మహబూబాబాద్ ఆస్పత్రికి వెంటనే తరలించారు. సదరు యువకుడు చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందాడు. ఆ యువకుడు ఇంటికన్నెలో ఏదైనా రైలు నుంచి దిగినట్లుగా భావిస్తున్నారు.

Tags:    

Similar News